స్త్రీలను తీవ్రంగా వేధించే సమస్యల్లో ఆవాంఛిత రోమాలు ఒకటి.ముఖ్యంగా అప్పర్ లిప్ పై అవాంఛిత రోమాలు ఏర్పడటం సర్వ సాధారణం.
అయితే కొందరిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి.వీటిని తొలిగించుకోవడానికి తరచూ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు.
అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో బ్యూటీ పార్లర్స్ వెళ్లే పరిస్థితి లేదు.దీంతో అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలను నివారించుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు.
అయితే న్యాచురల్‌గా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అప్పర్‌లిప్‌పై అన్వాండెడ్ హెయిర్‌ను తొలిగించడంలో అరటి పండు గ్రేట్‌గా సహాయపడుతుంది.
అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో బాగా పండిన అరటి పండు గుజ్జు, శెనగపిండి, పాలు మరియు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదవిపై అప్లై చేసి డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత తడి చేత్తో బాగా రుద్దుతూ కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆవాంఛిత రోమాలు తొలగి పోతాయి.

అలాగే అరటి పండు గుజ్జులో ఓట్స్ పొడి మరియు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్పర్ లిప్‌పై అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత నీటితో తడి చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక అరటి పండు గుజ్జులో ఎగ్ వైట్ మరియు కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆవాంఛిత రోమాలపై పూసి.ఆరనివ్వాలి.
ఆ తర్వాత బాగా స్క్రబ్ చేస్తూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.