బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రవికృష్ణ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా మంచోడు అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న రవికృష్ణ ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో నటిస్తున్నారు.
ఈ సీరియల్ లో రవికృష్ణకు జోడీగా నవ్యస్వామి నటిస్తుండగా రవికృష్ణ నవ్యస్వామి పలు టీవీ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుండటం గమనార్హం.రవికృష్ణ నవ్యస్వామి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందనే కామెంట్లు సైతం వినిపించాయి.
గతంలో ఈ షోలో ఈ జోడీకి పెళ్లి కూడా చేసేయడం గమనార్హం.అయితే నేడు రవికృష్ణ పుట్టినరోజు కావడంతో నవ్యస్వామి పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడంతో పాటు బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
నవ్యస్వామి తన పోస్ట్ లో రవికృష్ణ కోరుకున్న ప్రతిదీ దక్కాలని 2021 సంవత్సరమంతా రవికృష్ణకు బాగుండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
మరోవైపు బిగ్ బాస్ షో సీజన్3 లో పాల్గొన్న శివజ్యోతి సైతం రవికృష్ణ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
సావిత్రి సోషల్ మీడియాలో కొడుకు పుడితే రవికృష్ణలా పెంచుతానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.ఒకవేళ కొడుకు పుట్టకపోయినా ఏమీ కాదని ఎందుకంటే కొడుకు లాంటి నువ్వు ఉన్నావనే నమ్మకం అని శివజ్యోతి అన్నారు.ఆ పోస్ట్ కు రవికృష్ణ స్పందిస్తూ లవ్ యూ అమ్మా అని పెట్టారు.
హీరోకు కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న రవికృష్ణ భవిష్యత్తులో హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటారేమో చూడాల్సి ఉంది.మరోవైపు రవికృష్ణ నవ్యస్వామి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తుండగా వాళ్లిద్దరూ ఆ వార్తలను తరచూ ఖండిస్తూ వస్తున్నారు.