' గ్రేటర్ ' పై పవన్ కన్ను ? ఇక వారికి ఇబ్బందే ?

త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది.బీజేపీతో పొత్తు ఉండడంతో తెలంగాణలోని గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు కోరుతూ ఉండడంతో, పవన్ సైతం ఎన్నికల ప్రచారానికి దిగాలని నిర్ణయించుకున్నట్లు గా తెలుస్తుంది.

 Janasena Chief Pawan Kalyan To Focus Ghmc Elections, Ghmc Elections, Bjp, Janase-TeluguStop.com

ఈ మేరకు బిజెపి సైతం జనసేనకు కొన్ని డివిజన్లను కేటాయించేందుకు సిద్ధం అవడంతో, ఈ రెండు పార్టీలు కలిసి గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి.  తెలంగాణ అంతటా పవన్ కు బలం లేకపోయినా,  జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం పవన్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

దీంతో ఎన్నికల బరిలోకి దిగితే సానుకూల ఫలితాలు వస్తాయని, దీనికితోడు బిజెపికి సహకరించినట్లవుతుందనే అభిప్రాయంతో పవన్ ఉన్నారట.

ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా హైదరాబాదు లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ప్రభుత్వ సాయం పై పవన్ సంచలన విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

ముఖ్యంగా వరద సహాయం కి సంబంధించి 111 జీవో విషయమై పవన్ పదేపదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ హడావుడి చేస్తున్నారు.ఇదే కాకుండా హైదరాబాద్ లో నెలకొన్న అనేక సమస్యలు పైన పవన్ స్పందిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

  గ్రేటర్ పరిధిలో బలం పెంచుకుని జనసేన తో పాటు బిజెపికి మేలు జరిగే విధంగా చేయాలని విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు.అలాగే జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లకు కొత్త కమిటీలను నియమిస్తున్నారు.

ఇప్పటికే మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో అనేక కమిటీలను నియమించారు.ఏదో రకంగా జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలని పవన్ అభిప్రాయపడుతున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో జనసేన కు ఎనిమిది లక్షలు సభ్యత్వం ఉందని, ప్రతి నియోజకవర్గంలో జనసేన సభ్యులు ఉన్నారని, ఎంతోకొంత గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని నమ్ముతున్నారు.

ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జనసేన పార్టీకి బలం ఉందని నమ్ముతున్నారు.

అలాగే కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్,  మల్కాజ్ గిరి, ఉప్పల్, సికింద్రాబాద్, సనత్ నగర్ , ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో జనసేనకు కాస్త బలంగా ఉండడంతో, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు.ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారాలపై లెక్కలు వేసుకునే పనిలో ఉన్నాయి.

బిజెపి జనసేన ఈ రెండు కలిస్తే అధికారం సాధించడం ఏమంత కష్టం కాదు అనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube