అన్న ఐఏఎస్.. తమ్ముడు ఐపీఎస్.. ఈ అన్నాదమ్ముళ్ల సక్సెస్ స్టోరీ వింటే మాత్రం షాకవ్వాల్సిందే!

ఒకే కుటుంబంలో ఒకరు ఐఏఎస్ మరొకరు ఐపీఎస్ కావడం సులువైన విషయం కాదు.సివిల్ సర్వీసెస్ ఎంతోమంది కల కాగా తల్లీదండ్రులు తమ పిల్లలు ఐపీఎస్ లేదా ఐఏఎస్ అయితే బాగుంటుందని భావిస్తారు.

 Jagat Sai Vasanta Kumar Success Stories Details Here Goes Viral In Social Media-TeluguStop.com

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అన్నాదమ్ములు జగత్ సాయి, వసంతకుమార్ ( Jagat Sai, Vasantakumar )సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.జగత్ సాయి సివిల్స్ లో 32వ ర్యాంక్ తో జగత్ సాయి ఐఏఎస్ సాధించారు.

వసంత్ కుమార్ 170వ ర్యాంక్ తో ఐపీఎస్ గా విజయం సాధించారు.ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేసిన జగత్ సాయి, వసంతకుమార్ ఐఏఎస్, ఐపీఎస్ గా పని చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

జగత్ సాయి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ కాగా వసంత కుమార్ రెండో ప్రయత్నంలో ఐపీఎస్ అయ్యారు.జగత్ సాయి మీడియాతో మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ జాబ్( Software Job ) సంతృప్తి ఇవ్వకపోవడంతో ఐఏఎస్ కావాలని కల కని ఆ కల నెరవేర్చుకున్నానని తెలిపారు.

వసంత కుమార్ మాట్లాడుతూ అన్నయ్య బాటలో నేను నడిచానని అన్నారు.అన్నయ్య సహాయసహకారాల వల్ల రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ కావడం సంతోషంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను( Central, State Government Schemes ) ప్రజలకు చేరేలా కృషి చేస్తానని జగత్ సాయి చెబుతుండగా శాంతి భద్రతలపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని వసంత్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో మా చదువు సాగిందని జగత్ సాయి పేర్కొన్నారు.తమిళనాడు రాష్ట్రంలోని విట్ కాలేజ్ లో బీటెక్ మెకానికల్( B.Tech Mechanical in Wit College ) పూర్తి చేశానని జగత్ సాయి అన్నారు.నాకు క్రికెట్ ఆడటమంటే ఇష్టమని కాలేజ్ టీమ్ కు నేనే కెప్టెన్ అని జగత్ సాయి అన్నారు.తాను అమ్మమ్మ దగ్గర చదివానని మధురవాడలోని ప్రముఖ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేశానని వసంతకుమార్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube