బుల్లితెరపై ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.
ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది( Hyper Aadi ) టీంలో పని చేస్తున్నటువంటి కమెడియన్ గణపతి( Ganapathi ) గురించి అందరికీ తెలిసిందే.
కాస్త బొద్దుగా ఉన్నటువంటి గణపతి ఆది టీంలో తనకు భార్యగా ఎన్నో స్కిట్లు చేస్తూ సందడి చేశారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీ పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించిన గణపతి ఈ కార్యక్రమానికి హైపర్ ఆది దూరం కావడంతో ఆయన కూడా దూరమయ్యారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి ఈయన ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన గణపతి ఒక్కసారిగా బడిపంతులుగా మారిపోయారు.కమెడియన్ గా ఉన్నటువంటి ఇతను టీచర్ కావడం ఏంటి అనే విషయానికి వస్తే.1998 డీఎస్సీ( DSC ) అభ్యర్థులు పోస్టింగ్ ఇవ్వాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

ఇలా ఆ డీఎస్సీలో ఉద్యోగం సాధించినటువంటి గణపతి ప్రస్తుతం ప్రభుత్వ టీచర్ ( Government Teacher )గా ఉత్తర్వులు అందుకున్నారు.ఈయన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలానికి చెందిన వ్యక్తి.ఈ క్రమంలోనే ఈయన తన సొంత మండలంలోని ప్రస్తుతం ప్రభుత్వ టీచర్గా స్థిరపడి విధులు నిర్వహిస్తున్నారు.ఇక ఈ విషయం గురించి గణపతి మాట్లాడుతూ టీచర్ ఉద్యోగంలో స్థిరపడాలన్నది తన 25 సంవత్సరాల కల అని, ఆ కల ఇప్పటికి నెరవేరిందని ఈయన తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ గా పని చేశానని తెలియజేశారు.ఇలా ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో నేటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.