నా మీద తోడెళ్ళలా దాడి చేస్తున్నారు.తమ్ముడు దయ్యం ఎలా అయ్యారో వాళ్ళే చెప్పాలి.
అబద్దాలకోరలు ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు.నిఖార్సైన వాడిని, ముక్కుసూటిగా పని చేశాను.ఏనాడూ కూడా ధర్మాన్ని, ప్రజలను వదలలేదు.18 ఏళ్లుగా మీరు ఆశీర్వదిస్తే, మీకు సేవ చేస్తే గెలిపించారు తప్ప మాయ మాటలు చెప్తే కాదు.నేను కొత్తగా వచ్చానట.
ఢిల్లీ సర్కారును మెడలు వంచిన దాంట్లో మన ఉప్పల్ రైల్వే స్టేషన్ చరిత్ర లేదా ? పట్టాల మీద పడుకున్న వాడిగా, నిఖార్సైన ఉద్యమకారునిగా ఆంధ్ర అసెంబ్లీ నిప్పులు చెరిగిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు.కందుగుల గ్రామంలో ఆ దుర్మార్గులకు ఒక్క ఓటు కూడా పడవద్దు.ఇప్పుడు వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం నావల్లనే వచ్చింది అని మర్చిపోకండి.కెసిఆర్ అహంకారాన్ని దించాలి.