అక్కడ వైసీపీకి మరోసారి పరాభవమేనా?

మొదట నుంచి విశాఖపట్నం టీడీపీకి అనుకూలమైన ప్రాంతం అని చెప్పొచ్చు.ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధిస్తూ వస్తోంది.ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ అద్భుతమైన విజయాలు అందుకుంటోంది.2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకుంది.అంటే విశాఖలో టీడీపీ బలం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో టీడీపీ బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తూ వస్తోంది.విశాఖను రాజధానిగా ప్రకటించి రాజకీయ లబ్ది పొందాలని చూసింది.

 Is There Another Defeat For Ycp In Vishaka?.. Andhra Pradesh, Vishakapatnam, Ysr-TeluguStop.com

కానీ మూడేళ్లు దాటినా రాజధాని ఊసు లేకపోవడంతో విశాఖ వాసులు కూడా వైసీపీ కుటిల రాజకీయాన్ని అర్ధం చేసుకున్నారు.

దీంతో అనూహ్యంగా వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది.మరోసారి విశాఖలో టీడీపీకే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.జనసేనతో టీడీపీ కలిసి పనిచేస్తే విశాఖలో వైసీపీ మరోసారి ఒక్కసీటులో కూడా గెలిచే పరిస్థితులు ఉండవు.టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది.అలా కాకుండా రెండు కలిస్తే మాత్రం విశాఖలో క్లీన్ స్వీప్ చేయొచ్చు.

ముఖ్యంగా విశాఖ తూర్పులో టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.వైసీపీ ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా ఆయన పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నారు.

ఇక్కడ వైసీపీలో గ్రూపు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నాయి.మూడు వర్గాలు ఆరు తగువులతో వైసీపీ ఆపసోపాలు పడుతోంది.

విశాఖ తూర్పు నుంచి 2014లో పోటీ చేసి ఓడిన వంశీకృష్ణ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.

Telugu Andhra Pradesh, Ap Poltics, Telugu Desam, Vijaya Nirmala, Vishakapatnam,

2019 ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిముషంలో భీమిలి నుంచి వచ్చిన విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్ కేటాయించింది.దాంతో నాడు వంశీ వర్గీయులు ఆగ్రహంతో ఏకంగా వైసీపీ ఎంపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.కానీ విజయనిర్మల ఓడిపోవడంతో వంశీ వర్గీయులే కారణమని ఆరోపించారు.

అయితే మేయర్ ఎన్నికల్లో గొలగాని హరి వెంకటకుమారి విజయం సాధించారు.ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయింపు వైసీపీకి కత్తి మీద సాములా మారనుంది.

దీంతో టీడీపీ టిక్కెట్ ఎవరికి వచ్చినా మరోసారి ఆ పార్టీదే విజయం పక్కా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube