పీకే తన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నాడా?

తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన దగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలు మొత్తం ప్రశాంత్ కిషోర్ కేంద్రంగానే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం పట్ల ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించకున్నా ఇప్పటికె ప్రశాంత్ కిషోర్ తో జరిగిన భేటీలో రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చినా ఇక ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్ వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ప్రశాంత్ కిషోర్ కు తెలియజేసినట్లు తెలుస్తోంది.

 Is Pk Implementing His Strategy In Telangana Telangana Politics, Kcr, Prashant-TeluguStop.com

ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి గెలిచేందుకు కావలసిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసిన కేసీఆర్ రానున్న రోజుల్లో వ్యూహాలను అమలుపరిచే అవకాశం వందకు వంద శాతం ఉంది.

అయితే ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో పీకే తన వ్యూహాలను అమలు చేయకున్నా కొద్దికొద్దిగా ఇప్పుడిప్పుడే అమలు చేస్తూ వ్యూహ ప్రభావం ఎంత మేరకు ఉండవచ్చుననే అంచనాకు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే మంత్రిపై హత్యాయత్నం అనే ఘటన ఎవరికి రాజకీయంగా లాభం, ఎవరికి రాజకీయంగా నష్టం అనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో ఎంతో కొంత జరుగుతున్న, జరిగిన పరిణామాలను బట్టి కొంత మనకు అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

Telugu @cm_kcr, Bandi Sanajay, Bjp, Telangana, Trs-Political

అయితే ఏది ఏమైనా దేశంలో బీజేపీని ఆధికారంలోకి తెచ్చిన అపార అనుభవం ఉన్న ప్రశాంత్ కిషోర్ కు తెలంగాణ మరల టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకవచ్చేలా వ్యూహాలు రచించడం అనేది చాలా చిన్న విషయం.అయితే ఏ రాష్ట్రం రాజకీయం ఆ రాష్ట్రానికి ప్రత్యేకం అన్నట్టు ఒక రాష్ట్ర రాజకీయాన్ని ఒక రాష్ట్రంతో మనం పోల్చలేము కాబట్టి మరి పీకే ఎంత మేరకు తెలంగాణలో సఫలీకృతుడవుతాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube