26000 మంది పిల్లల జీవితాలను మార్చిన ఐఆర్ఎస్ అధికారి మేఘా.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

గొప్పగొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో గొప్ప మనస్సు ఉన్నవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.ప్రస్తుత కాలంలో స్వార్థంతో ఆలోచించే వాళ్లు ఎక్కువమంది ఉన్నారు.

 Irs Officer Megha Bhargava Success Story Details,irs Officer Megha Bhargava, Meg-TeluguStop.com

అయితే ఐ.ఆర్.ఎస్ అధికారిణి మేఘా( IRS Megha ) మాత్రం తన మంచితనంతో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.మేఘా భార్గవ చిన్నప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నారు.

డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవడం కోసం కోర్సును పూర్తి చేసిన తర్వాత ఆమె డెంటల్ ఆస్పత్రిలో పని చేశారు.అయితే ఉద్యోగం నుంచి సంతృప్తి లభించకపోవడంతో మేఘా భార్గవ( Megha Bhargava ) సివిల్ సర్వీసెస్ పై దృష్టి పెట్టి ఐఆర్ఎస్ అధికారి అయ్యారు.

ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మేఘా భార్గవ సమర్పన్( Samarpan ) అనే ఎన్జీవోకు ముఖ్య సలహాదారుగా ఎంపిక కావడం జరిగింది.మేఘా భార్గవది రాజస్థాన్ కాగా ఆమె తల్లి పాఠశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు.

Telugu Civil, Megha Bhargava, Irs, Meghabhargava, Rajasthan, Ruma Bhargava, Sama

తనలోని నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి సివిల్ సర్వీసెస్( Civil Services ) ఉత్తమమని అమె భావించారు.ఆస్పత్రిలో పని చేస్తూనే మిగతా సమయంలో ఎలాంటి శిక్షణ లేకుండా పరీక్షలు రాసి ఐఆర్ఎస్ అధికారి( IRS Officer ) అయ్యారు.ట్రైనింగ్ లో కంటే ఉద్యోగంలోనే అసలు శిక్షణ ఉంటుందని ఆమె చెబుతున్నారు.ముంబైలో మేఘ తొలి పోస్టింగ్ కాగా ప్రస్తుతం మేఘ ఈ ధృవీకరణ స్కీమ్ అమలు కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉన్నారు.

Telugu Civil, Megha Bhargava, Irs, Meghabhargava, Rajasthan, Ruma Bhargava, Sama

ఈమె సోదరి రుమా భార్గవ( Ruma Bhargava ) ప్రారంభించిన ఎన్జీవోలో చేరిన మేఘా భార్గవ ఈ సంస్థ ద్వారా 26,000 మంది పిల్లల జీవితాలకు చేయూత ఇవ్వడంతో పాటు వాళ్ల జీవితాలు మారేలా చేశారు.90 పాఠశాలల్లోని పిల్లలకు ఈ సంస్థ సహాయం చేసింది.కరోనా సమయంలో లక్షల మందికి భోజనం అందించడం విషయంలో ఈమె ఎంతో కష్టపడ్డారు.మేఘా భార్గవ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube