క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం సువర్ణ నాణెం ఆవిష్కరణ..నాణెం విలువ ఎన్ని కోట్లంటే..?

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2( Queen Elizabeth II ) మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సువర్ణ నాణేన్ని ఆవిష్కరించింది.ఈ నాణెం విలువ 23 మిలియన్ డాలర్లు.మన భారత కరెన్సీలో ఈ సువర్ణ నాణెం విలువ రూ.191 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

 Invention Of Gold Coin In Honor Of Queen Elizabeth-2 How Many Crores Is The Valu-TeluguStop.com
Telugu Arnold Machin, India Company, General, Gold Coin, Ian, Latest Telugu, Mar

క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీ( East India Company ) ఈ సువర్ణ నాణేన్ని ప్రత్యేకంగా ఆవిష్కరించింది.ఈ నాణెం తయారీలో ఏకంగా నాలుగు కేజీల బంగారం, 6400కు పైగా వజ్రాలను ఉపయోగించారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం ఇదే.ఈ సువర్ణ నాణెం 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసంతో బాస్కెట్ బాల్ పరిమాణంలో ఉంటుంది.ఈ నాణెం రూపొందించడంలో కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు ఇయాన్ ర్యాంక్, రాఫెల్ మక్లౌఫ్, ఆర్నాల్డ్ మచిన్, మేరీ గిల్లిక్ ఎంతగానో శ్రమించినట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలిపింది.

Telugu Arnold Machin, India Company, General, Gold Coin, Ian, Latest Telugu, Mar

ఇప్పటివరకు 1993 నాటి డబుల్ ఈగిల్ నాణెం( Eagle coin ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం గా గిన్నిస్ రికార్డులో ఉంది.న్యూయార్క్ లో జరిగిన వేలంలో డబుల్ ఈగిల్ నాణెం 18.9 మిలియన్ డాలర్లు పలికింది.భారత సంతతికి చెందిన వ్యాపారవేత సంజీవ్ మెహతా( Businessman Sanjeev Mehta ) ఈ డబుల్ ఈగిల్ నాణెంను 2010లో కొనుగోలు చేశారు.

ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం తయారుచేసిన నాణెం విక్రయం గురించి ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.ఈ నాణెంపై క్వీన్ ఎలిజబెత్-2 చిత్రాలు ఉన్నాయి.నాణెం మధ్యలో పెద్ద పరిమాణంలో కిరీటం గుర్తు ఉండే చిత్రం ఉంటుంది.దీనికి వెనుక భాగంలో రాణి ఎలిజబెత్-2 చిత్రం ఉంటుంది.

చిత్రానికి చుట్టూ 10 చిన్న నాణేలు పొదిగి ఉంటాయి.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం ఇదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube