ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో జై భీమ్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.సినిమాలో హీరో సూర్య జస్టిస్ కె.
చంద్రు పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.లాయర్ గా ఉన్న సమయంలో రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా జస్టిస్ కె.చంద్రు వాదించిన కేసులలో చిన్నతల్లి కేసు ఒకటి.తాజాగా జస్టిస్ కె.చంద్రు ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఊహ తెలిసే సమయానికి అమ్మ అనారోగ్యంతో చనిపోయారని పెద్దవాళ్లు నాన్నకు రెండో పెళ్లి చేసుకోవాలని సూచనలు చేసినా నాన్న ఎవరి మాట వినలేదని చంద్రూ అన్నారు.
నాన్న రైల్వే క్లర్క్ గా పని చేసేవారని బాల్యంలో రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకొచ్చే బాధ్యత తనదే కావడంతో ఉదయం నాలుగున్నరకు మేలుకోవడం అలవాటైందని చంద్రు చెప్పుకొచ్చారు.అప్పట్లో రోజువారీ కోటా కింద రేషన్ సరుకులు ఇచ్చేవారని చంద్రు తెలిపారు.
చిన్నప్పుడు నాన్న పత్రికలు చదవడం అలవాటు చేశారని సెలవు రోజుల్లో లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవాడినని చంద్రు చెప్పుకొచ్చారు.ఎంబీబీఎస్ చదవాలని ఉన్నా తనకు సీటు రాలేదని చంద్రు పేర్కొన్నారు.
తాను విద్యార్థి రాజకీయాలలో తలమునకలై అన్యాయాన్ని ప్రశ్నించడంతో డిగ్రీ సెకండ్ ఇయర్ లో కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారని చంద్రు పేర్కొన్నారు.ఒక జడ్జి లా చదవాలని సూచించడంతో లా కాలేజ్ లో చేరానని చంద్రు వెల్లడించారు.
తమిళనాడులోని నైవేలిలో బస్సు కోసం ఎదురు చూసే సమయంలో పార్వతి తన దగ్గరకు వచ్చి భర్త కనిపించడం లేదని చెప్పిందని తాను హెబియస్ కార్పస్ పిటిషన్ వేయించానని చంద్రు అన్నారు.2006 సంవత్సరంలో తాను న్యాయమూర్తినయ్యానని ఏడు సంవత్సరాలలో ఏకంగా 96 వేల కేసులను చూడగలిగానని చంద్రు వెల్లడించారు.తనది లవ్ మ్యారేజ్ అని కూతురు కీర్తి దంత వైద్యురాలిగా పని చేస్తోందని చంద్రు చెప్పుకొచ్చారు.