రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా నాయకులు హైదర్ నగర్ డివిజన్ భాగ్యనగర్ కాలనీ ముంబై ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మధ్యలో పెట్టి బతుకమ్మ ఆడుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.
వ్యాట్ తగ్గించాలి ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మాట్లాడుతూ.
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించక పోవడంతో వాహనదారులపై మోయలేని భారం పడుతుందని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ ప్రజల నడ్డి విరచడమే అభివృద్ధా అని ప్రశ్నించారు.
వచ్చే నెలజీతం పెట్రోల్ కోసమే వెచ్చిస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.