భారత సంతతికి చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త డాక్టర్ శివ్ పాండేకు యూకేలోని లివర్‌పూల్ సిటీ కౌన్సిల్ ప్రతిష్టాత్మక ‘‘సిటిజన్ ఆఫ్ హానర్’’ అవార్డ్‌ను ప్రదానం చేసింది.లివర్‌పూల్ పౌర సమాజ ప్రతిష్టను మెరుగుపరచడానికి అసాధారణమైన సహకారాన్ని అందించిన వ్యక్తులకు ‘‘సిటిజన్ ఆఫ్ హానర్’’ అవార్డ్‌ను ప్రదానం చేస్తారు.బుధవారం ఈ అవార్డును లార్డ్ మేయర్ ఆఫ్ లివర్‌పూల్ రాయ్ గ్లాడెన్.83 ఏళ్ల శివ్ పాండేకు ప్రదానం చేశారు.సర్జన్‌గా, జనరల్ ప్రాక్టీషనర్‌గా వృత్తితో పాటు దయ, కరుణ, సాయం చేసే గుణం ఆయనలో వున్నాయని ఈ సందర్భంగా మేయర్ అన్నారు.అతని రోగులలో చాలా మంది చిన్నప్పటి నుంచి శివ్‌పాండేను చూస్తూ పెరిగిన వారున్నారని.
ఏళ్లుగా నిస్వార్థంగా నగర ప్రజలకు ఆయన సేవ చేశాడని గ్లాడెన్ ప్రశంసించారు.అతని పనికి గుర్తింపుగా ‘‘సిటిజన్ ఆఫ్ హానర్’’ పురస్కారాన్ని అందించినందుకు తనకు సంతోషంగా వుందన్నారు.
వైద్యరంగానికి చేసిన సేవలకు గాను 1989లో పాండే .మెంబర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్‌గా ఎంపికయ్యారు.గడిచిన ఐదు దశాబ్ధాలుగా లివర్‌పూల్‌లో నివసిస్తున్న ఆయన బ్రాడ్‌గ్రీన్ హాస్పిటల్‌లో సర్జన్‌గా తన వృత్తిని ప్రారంభించారు.ఈ క్రమంలో లివర్‌పూల్‌లోని అత్యంత వెనుకబడిన కమ్యూనిటీలకు 30 ఏళ్లుగా జనరల్ ప్రాక్టీషనర్‌గా సేవలందించారు.
ఈ సందర్భంగా శివ్ పాండే మాట్లాడుతూ.దాదాపు అర్ధ శతాబ్ధ కాలంగా తన నివాసంగా వున్న లివర్‌పూల్ నగరం నుంచి ‘‘సిటిజన్ ఆఫ్ హానర్’’గా గౌరవం పొందినందుకు సంతోషంగా వుందన్నారు.
తనను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినందుకు లివర్‌పూల్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే.విదేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృదేశం పట్ల ఆయన తన అభిమానాన్ని చాటుకుంటూనే వున్నారు.భోపాల్ గ్యాస్ దుర్ఘటన, మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం వల్ల అనాథలైన వారి కోసం నిధుల సేకరణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సేవా కార్యక్రమాలలో శివ్ పాండే పాల్గొన్నారు.1982లో ఆయన లివర్‌పూల్ ఫెయిత్ నెట్‌వర్క్‌ని స్థాపించడమే కాకుండా 24 ఏళ్లపాటు మేజిస్ట్రేట్‌గా కూడా పనిచేశారు.