యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
ఇకపోతే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని తరచూ వాయిదా పడుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని చివరి నిమిషంలో కూడా మరొక రోజుకు వాయిదా వేశారు.
ఇలా తరచు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా విడుదలకు ఆలస్యం కావడమే కాకుండా తరచు వాయిదా వేయడంతో నిఖిల్ ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన సినిమా విడుదల చేయడానికి థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా తన సినిమాకు థియేటర్ దొరకకుండా చేస్తున్నారు అనడంతో చాలామంది ఈ విషయంలో దిల్ రాజు ప్రమేయం ఉందని ఆయన వల్లే ఇతనికి థియేటర్ లు దొరకడం లేదంటూ భావించారు.

ఇలా కార్తికేయ 2సినిమా విడుదల వాయిదా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఉందంటూ వచ్చిన ఈ వార్తలపై తాజాగా హీరో నిఖిల్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విడుదల వాయిదాకు దిల్ రాజు గారికి ఎలాంటి సంబంధం లేదని నిజం చెప్పాలంటే ఆయన వల్లే ఈ సినిమా ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైందని వెల్లడించారు.ఇక ఈ సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.ఈ సినిమా తరచూ వాయిదా పడటం వల్ల ఒక మంచి సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందన్న బాధలో తాను ఉన్నానని, ఈ సినిమాని ఫలానా వారి వల్ల వాయిదా పడుతుందని ఎక్కడ ప్రస్తావించలేదంటూ ఈయన కామెంట్ చేశారు.
ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







