ఆ సినిమా గురించి త్రివిక్రమ్ కు ఒక మాట చెప్పాలి: ఇంద్రజ

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటితరం హీరోయిన్ ఇంద్రజ ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

 I Said One Word To Trivikram About That Movie By Indraja , Indraja, Tollywood,-TeluguStop.com

ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తూ సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తన పాత్రకు అనుగుణంగా ఎలాంటి సినిమాలు వచ్చిన తప్పకుండా నటిస్తానని ఈమె తెలియజేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాని త్రివిక్రమ్ తన మార్క్ కి విభిన్నంగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో మహేష్ బాబుని దేవుడిగా చూపించడాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు అందుకే ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.

Telugu Indraja, Khaleja, Telugu, Tollywood, Trivikram-Movie

ఈ క్రమంలోనే ఇంద్రజ మాట్లాడుతూ తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంతో ఇష్టమని ఆయన సినిమాల్లో తప్పకుండా ఒక కంటెంట్ ఉంటుందని తెలిపారు.ఇకపోతే ఖలేజా వంటి సినిమా ద్వారా ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని త్రివిక్రమ్ గారు చూపించారు.అహం బ్రహ్మాస్మి అనేది నాకు బాగా నచ్చింది.

ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది.ఇక ఈ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడితే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, నా దృష్టిలో ఖలేజా సినిమా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube