సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లికి ఆహ్వానం పంపిన నయన్ విగ్నేష్.. వీడియో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న టువంటి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు జూన్ 9వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.

 Nayan Vignesh Send Wedding Invitation To Social Media Platform Video Goes Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే పెళ్లికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.కేవలం బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వివాహం జరుగుతుందని విగ్నేష్ వీరి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ జంట తమ పెళ్లికి ఆహ్వానం పలుకుతూ ఒక వీడియోని విడుదల చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ యానిమేటెడ్ వీడియోలో వధూవరులిద్దరు సాంప్రదాయ దుస్తులను ధరించి నడుస్తున్నట్లు చూపించారు.ఈ ఇన్విటేషన్ కార్డులో నయనతార విగ్నేష్ తల్లిదండ్రుల పేరుతో పాటు పెళ్లి జరిగే సమయం, తేదీ, పెళ్లి వేదిక గురించి తెలియజేశారు.

ఈ విధంగా తమ పెళ్ళికి ఆహ్వానం పలుకుతూ క్రియేట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారుతుంది.ఇకపోతే మొదట తిరుపతిలో వీరి వివాహం చేసుకోవాలని భావించగా కొన్ని సమస్యల కారణంగా వీరి వివాహ వేదికను మహాబలిపురంలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఇక రేపు ఉదయమే పెళ్లి కావడంతో ఇప్పటికే మహాబలిపురంలో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టడమే కాకుండా పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube