ఆ సినిమా గురించి త్రివిక్రమ్ కు ఒక మాట చెప్పాలి: ఇంద్రజ

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటితరం హీరోయిన్ ఇంద్రజ ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తూ సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

తన పాత్రకు అనుగుణంగా ఎలాంటి సినిమాలు వచ్చిన తప్పకుండా నటిస్తానని ఈమె తెలియజేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాని త్రివిక్రమ్ తన మార్క్ కి విభిన్నంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో మహేష్ బాబుని దేవుడిగా చూపించడాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు అందుకే ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.

"""/"/ ఈ క్రమంలోనే ఇంద్రజ మాట్లాడుతూ తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంతో ఇష్టమని ఆయన సినిమాల్లో తప్పకుండా ఒక కంటెంట్ ఉంటుందని తెలిపారు.

ఇకపోతే ఖలేజా వంటి సినిమా ద్వారా ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని త్రివిక్రమ్ గారు చూపించారు.

అహం బ్రహ్మాస్మి అనేది నాకు బాగా నచ్చింది.ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది.

ఇక ఈ సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడితే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, నా దృష్టిలో ఖలేజా సినిమా ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.

పురాణాలే కమర్షియల్ ముడి సరుకుగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు !