బుల్లితెరపై ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే.ఇందులో ఎంతో మంది కమెడియన్స్ తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు.
అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.ముఖ్యంగా అందులో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఎందుకంటే సరైన టైమింగ్ లో పంచ్ లు వేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.అంతేకాకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ తెగ పంచులు వేస్తూ ఉంటాడు.
కొన్ని కొన్ని సార్లు అవతలివారిని కించపరిచేలా కూడా చేస్తుంటాడు.నోటికి వచ్చిన డైలాగు వేస్తూ అందరి దృష్టిలో పడుతూ ఉంటాడు.
గతంలో తన డైలాగులతో రెచ్చిపోవడంతో పలు వాదనలు కూడా ఎదుర్కొన్నాడు.
ఇక జబర్దస్త్ లో అమ్మాయిలతో కలిసి ఒక రొమాంటిక్ డాన్స్ చేస్తూ, డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఉంటాడు.
ఇక ఆయన డైలాగులకు అక్కడున్న వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.మరో డాన్స్ షో ఢీ లో కూడా టీం లీడర్ గా చేస్తున్నాడు హైపర్ ఆది.అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా బాగా సందడి చేస్తుంటాడు.ఇక ఈవెంట్ సమయాల్లో హైపర్ ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు.
షో మొత్తాన్ని తన పంచులతో తెగ హడావుడి చేస్తూ ఉంటాడు.ఇక ఈయనకు వెండితెరపై కూడా పలు సినిమాల్లో అవకాశాలు రాగా.
అక్కడ కూడా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ లో కూడా చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.ప్రస్తుతం బిజీ లైఫ్లో గడుపుతున్నాడు హైపర్ ఆది.ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆది అసలు విషయాన్ని బయట పెట్టాడు మరొ కమెడియన్ నరేష్.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఇక అందులో హైపర్ ఆది తో పాటు పలువురు కమెడియన్లు, ఆర్టిస్టులు తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేసినట్లు కనిపించారు.
ఇక ఒక స్కిట్ లో భాగంగా నరేష్, హైపర్ ఆదికి మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుంది.ఇక నరేష్ హైపర్ ఆదితో గొడవ పడుతూ నాలుగు వేలు తీయమని అంటాడు.
దాంతో ఆది తన దగ్గర లేవు అనటంతో.వెంటనే నరేష్ రాత్రి పేకాట బెట్టింగ్ చేశావు కదా అంటూ కామెంట్ చేయటంతో అందరూ నవ్వుకున్నారు.
ఇక హైపర్ ఆది మాత్రం దొరికిపోయాను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవ్వగా.
దీనికి సంబంధించిన ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ బుల్లితెర అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.