పెళ్ళంటే నూరేళ్ళ పంటని కాబట్టి పెళ్లి చేసుకోబోయేటువంటి వధూవరులు క్షుణ్ణంగా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోవడం మంచిదని కొందరు చెబుతుంటారు.కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి బంధానికి క్రమక్రమంగా విలువ తగ్గుతుందని కొన్ని సంఘటనలను చూస్తే అర్థమవుతుంది.
తాజాగా ఎన్నో ఆశలతో, కలలతో పెళ్లి చేసుకొని నూతన జీవితాన్ని ప్రారంభిద్దామని అనుకున్నటువంటి ఓ యువతి తన మొదటి రాత్రి రోజే తన భర్త నిజస్వరూపాన్ని తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయింది.
వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో నివాసముంటోంది.
కాగా ఈమె స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది.ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు హైదరాబాదులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు.
దీంతో ఇటీవలే భారీగా కట్న కానుకలు సమర్పించి ఘనంగా వివాహం చేశారు.అనంతరం తమ అల్లుడు మంచి ఉద్యోగం చేస్తుండడంతో కూతురిని సంతోషంగా చూసుకుంటాడని యువత తల్లిదండ్రులు సంబర పడ్డారు.

కానీ పెళ్లయిన మొదటి రోజు రాత్రి తమ అల్లుడు చేసినటువంటి ఘనకార్యాన్ని తెలుసుకుని ఒక్కసారిగా బిత్తరపోయారు.పెళ్లయిన మొదటి రోజు శోభనం గదిలో వరుడు చాలా పైశాచికంగా ప్రవర్తించాడని వధువు ప్రైవేట్ శరీర భాగాలపై క్రూరంగా ప్రవర్తిస్తూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడట.అయితే రెండు, మూడు వారాలుగా వధువు ఈ విషయాలను తమ కుటుంబ సభ్యులతో చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేది.ఈ మధ్య కాలంలో తన భర్త చేష్టలకు విసిగిపోయిన నవ వధువు తన భర్త గురించి వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
దీంతో తమ అల్లుడు నిజ స్వరూపం గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించారు.అంతేగాక తమ కూతురు జీవితాన్ని చక్కదిద్దాలని పోలీసులను వేడుకున్నారు.
దీంతో పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.