కూటమికి భారీ షాకులిస్తున్న 16 మంది రెబల్స్.. ఆ స్థానాల్లో ఓటమి తప్పదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ( Chandrababu, Pawan Kalyan, Modi )ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే.అయితే మూడు పార్టీల పొత్తు వల్ల చాలా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అభ్యర్థులకు టికెట్లు దక్కలేదు.

 Huge Shock To Tdp Alliance Details Here Goes Viral In Social Media , Social Me-TeluguStop.com

చంద్రబాబు నాయుడు కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించి ఆ తర్వాత అభ్యర్థులను మార్చడం జరిగింది.అయితే కూటమికి షాకిస్తూ 16 చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది.

175 నియోజకవర్గాల్లో 16 చోట్ల రెబల్స్ నుంచి పోటీ అంటే సాధారణమైన విషయం కాదు.ఈ నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు గెలుస్తారో లేదో చెప్పలేం కానీ టీడీపీ, ఇతర పార్టీలను మాత్రం రెబల్ అభ్యర్థులు సులువుగానే ఓడిస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ఈ రెబల్ అభ్యర్థులలో కొంతమంది అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కడం విశేషం.రెబల్ అభ్యర్థులు కూటమిని ముంచే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

Telugu Chandrababu, Manifesto, Modi, Pawan Kalyan, Tdp Alliance-Politics

కనీసం ఐదు నుంచి 10 వేల ఓట్లను కూటమి అభ్యర్థులు చీల్చినా ఏపీలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోతాయని చెప్పవచ్చు.వీళ్లు అధికారిక రెబల్స్ కాగా అనధికారిక రెబల్స్ వల్ల పార్టీకి మరింత నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రెబెల్స్ దెబ్బకు టీడీపీ( TDP ) నేతలలో గుబులు మొదలైందని తెలుస్తోంది.

Telugu Chandrababu, Manifesto, Modi, Pawan Kalyan, Tdp Alliance-Politics

మరోవైపు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కూటమి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాని హామీలు అని కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ మాత్రం రావడం లేదు.రాష్ట్రంలో మరోసారి వైసీపీదే అధికారమని సర్వేలు చెబుతున్నాయి.

ఎన్నికలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube