నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైం, డిస్నీ హాట్‌స్టార్‌ను ఉచితంగా ఎలా పొందాలంటే..?

ఈరోజుల్లో ఓటీటీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.ప్రతి ఒక్కరి వద్ద ఏదో ఒక ఓటీటీ వీడియోస్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఉన్నారు.

 How To Get Free Access To Otts With Smartphone Recharge Plans , Amazon Prime And-TeluguStop.com

అయితే, ఈ ఓటీటీలకు కొన్ని ఆప్షన్ల ద్వారా ఉచితంగా కూడా పొందవచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా మనం ప్రతినెలా మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకుంటాం.జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు ఎన్నో ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి.

పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ కూడా ఉన్నాయి.వీటి వల్ల ఓటీటీ వీడియోలను చూసే బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి.

ఒకవేళ మీరు జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్‌ కస్టమర్లు అయితే,నెట్‌ఫ్లిక్స్, ప్రైం వీడియో లేదా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లను ఉచితంగా పొందవచ్చు.ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ డేటాతోపాటు అపరిమిత కాల్స్‌ సదుపాయం కూడా ఉంటుంది.

జియో ప్రీపెయిడ్‌ లేదా పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌.రిలయన్స్‌ జియో రూ.399 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ద్వారా 75 జీబీ ఎఫ్‌యూపీ డేటా లభిస్తుంది.దీంతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఫెసిలిటీ ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌తోపాటు జియో టీవీ యాక్సెస్, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైం వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ను ఉచితంగా పొందవచ్చు.

రిలయన్స్‌ జియో ఇన్ని ఓటీటీలను ఖర్చుతో కూడినవి.ఈ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లో రూ.399, 599, 799,999,1,499 కూడా ఉన్నాయి.జియో ప్రీ పెయిడ్‌ ప్లాన్ల ఆధారంగా డిస్నీ హాట్‌స్టార్‌ పొందవచ్చు.దీని ధర రూ.401.

ఎయిర్‌ టెల్‌ ప్లాన్స్‌… ఎయిర్‌టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌లో రూ.499 ద్వారా 75 జీబీ ఎఫ్‌యూపీ, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.దీంతోపాటు ఎయిర్‌టెల్‌ «థ్యాంక్స్‌ రివార్డ్స్‌ పొందవచ్చు.అమెజాన్‌ ప్రైం, డిస్నీ హాట్‌స్టార్‌ వీఐపీ ఏడాది పాటు పొందవచ్చు.ఎయిర్‌ టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌తోపాటు ప్రీపెయిడ్‌ ఏ ప్లాన్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్‌ ఫెసిలిటీ లేదు.కానీ, రూ.599 ద్వారా ప్రతిరోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ ఫెసిలిటీ, వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.

Telugu Amazonprime, Ideavodafone-Latest News - Telugu

వీఐ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌… వీఐ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ రూ.499 ద్వారా 75 జీబీ ఎఫ్‌యూపీ డేటా, అపరిమిత కాలింగ్‌ ఫెసిలిటీ, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.ఇందులో 200 జీబీ వరకు యాక్సెస్‌ చేసే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా అమెజాన్‌ ప్రైం, జీ5, టీవీ యాప్స్, కానీ నెట్‌ఫ్లిక్స్‌ లేదా హాట్‌స్టార్‌ పొందలేరు.మీకు ¯ð ట్‌ఫ్లిక్స్‌ కావాలనుకుంటే,వీఐ రెడ్‌ఎక్స్‌ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.దీని ధర నెలకు రూ.1,099.వినియోగదారులకు ఆరు నెలలపాటు లాకిన్‌ పిరియడ్‌తోపాటు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ అంతర్జాతీయ, జాతీయ యాక్సెస్‌ పొందగలరు.దీంతో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్‌ టీవీ లేదా మొబైల్‌ ప్లాన్‌ ఉంటుంది.సాధారణంగా దీని ధర రూ.5,988 వ్యాల్యూ చేస్తుంది.అదేవిధంగా ఏడాదిపాటు అమెజాన్‌ ప్రైం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube