నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, డిస్నీ హాట్‌స్టార్‌ను ఉచితంగా ఎలా పొందాలంటే..?
TeluguStop.com
ఈరోజుల్లో ఓటీటీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ప్రతి ఒక్కరి వద్ద ఏదో ఒక ఓటీటీ వీడియోస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని ఉన్నారు.
అయితే, ఈ ఓటీటీలకు కొన్ని ఆప్షన్ల ద్వారా ఉచితంగా కూడా పొందవచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం.జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు ఎన్నో ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి.
పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.వీటి వల్ల ఓటీటీ వీడియోలను చూసే బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఒకవేళ మీరు జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్ కస్టమర్లు అయితే,నెట్‌ఫ్లిక్స్, ప్రైం వీడియో లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లను ఉచితంగా పొందవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాతోపాటు అపరిమిత కాల్స్ సదుపాయం కూడా ఉంటుంది.
జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్.రిలయన్స్ జియో రూ.
399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 75 జీబీ ఎఫ్‌యూపీ డేటా లభిస్తుంది.దీంతో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌తోపాటు జియో టీవీ యాక్సెస్, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌ను ఉచితంగా పొందవచ్చు.