ఒక్క ప్రయాణికుడిని డెస్టినేషన్ తీసుకెళ్లేందుకు ఈ బస్సు డ్రైవర్ ఎంత ఖర్చు చేశాడంటే..

సాధారణంగా బస్సులు ఒకరి కోసం ఎప్పుడూ కూడా నడవవు.బస్ స్టేషన్ లో కూడా చాలామంది ఎక్కేదాకా బస్సును ఆపుతారు.

 How Much Did This Bus Driver Spend To Take One Passenger To The Destination, Vay-TeluguStop.com

ఎందుకంటే ఒక్క కిలోమీటర్ నడవడానికి బస్సు 95 రూపాయల దాకా డీజిల్ ఖర్చు అవుతుంది.అయితే ఇంత ఖర్చు అవుతున్నా సరే ఒక డ్రైవర్ కేవలం సింగిల్ ప్యాసింజర్ డెస్టినేషన్ కి తీసుకెళ్లాడు.

సమయానికి అతడిని దిగాల్సిన చోట సురక్షితంగా దింపాడు.

వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)కి వెళ్లే చాలా మంది ప్రజలు వాయు వజ్ర బస్సులను తీసుకోవడానికి ఇష్టపడతారు.

ఈ బస్సులు ఎయిర్ కండిషన్డ్, కంఫర్టబుల్‌గా ఉంటాయి టికెట్ ధర కూడా తక్కువే.నగరంలో పబ్లిక్ బస్సు రవాణా సేవను అందించే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (BMTC) వీటిని నిర్వహిస్తోంది.

ఇటీవల హరిహరన్( Hariharan ) అనే బెంగుళూరు వ్యక్తి ఎక్స్‌లో వాయు వజ్ర బస్సులో ఎదురైన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పంచుకున్నాడు.బస్సులో తాను మాత్రమే ప్రయాణిస్తున్నానని, అయినా డ్రైవర్, కండక్టర్ ట్రిప్‌ను క్యాన్సిల్ చేయలేదని సదరు ప్యాసింజర్ చెప్పాడు.అందుకు బదులుగా, ప్రయాణికుడిని సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లడానికి డ్రైవర్ బస్సును నడిపాడు.దాంతో ప్రయాణికుడు ఫిదా అయిపోయాడు.వారి సేవ, సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ, వారితో సెల్ఫీని పోస్ట్ చేశాడు.

అతడి ట్విట్టర్ పోస్ట్‌కి చాలా రిప్లైలు వచ్చాయి.కొంతమంది BMTC సిబ్బంది సహాయాన్ని ప్రశంసించారు.మరికొందరు ఒకే వ్యక్తి కోసం పెద్ద బస్సును నడపడం లాజిక్‌ను ప్రశ్నిస్తూ, అతన్ని వేరే బస్సులో మార్చాలని సూచించారు.బస్సు రన్నింగ్‌ కాస్ట్ కిలోమీటరుకు రూ.95 అని, ప్రయాణం చేయడం అదృష్టమని ఓ వ్యక్తి తెలియజేశాడు.వాయు వజ్ర బస్సులకు బెంగళూరులో 21 రూట్‌లు, 21 స్టాప్‌లు ఉన్నాయి.అవి విద్యార్థులు, IT ఉద్యోగులు, తక్కువ-ఆదాయ వర్గాల వంటి వివిధ ప్రయాణీకుల అవసరాలను తీరుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube