ఎల్‌పీజీ ధరలు ఏవిధంగా లెక్కిస్తారో తెలుసా? సిలిండర్‌ రేటు ఎప్పుడు పెరుగుతుందంటే..!

ఎల్‌పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) ధరలు ఆగస్టు 1 నుంచి రూ.25 నాన్‌ సబ్‌స్సిడైజ్డ్‌ 14.2 కేజీ సిలిండర్‌పై పెరిగింది.ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.850.కొన్ని నగరాల్లో అయితే రూ.900 కూడా వసూలు చేస్తున్నారు.2021 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌ ధర దాదాపు రూ.165 పెరిగింది.భారత్‌లో ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు ఇంపోర్ట్‌ ప్యారిటీ ప్రైస్‌ (ఐపీఈ) ఫార్మూల ప్రకారం నిర్ణయిస్తారు.

 How Lpg Cylinders Prices Calculated In India , 50 Crude , International Markrt ,-TeluguStop.com

సా«ధారణంగా ప్రతినెలా సిలిండర్‌ ధరలు సవరిస్తారు.ఆగస్టుకు ముందు జూలై 1న ఓసారి ధరలు సవరించారు.

ఎల్‌పీజీ ధరలు లెక్కించే విధానం

Telugu Crude, International, Ipp Formula, Lucknow-Latest News - Telugu

ఐపీపీ ఫార్మూల ప్రకారం ధరలు నిర్ధేశించినా ఎల్‌పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం మారుతూ ఉంటుంది.ఇండియాలో ఐపీపీ వినియోగంలో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారా సంతృప్తి చెందింది.కాబట్టి ఈ విధంగా లెక్కిస్తారు.ఐపీపీ ఫార్మూల సౌదీ ఆరమ్‌కో ఎల్‌పీజీ ధరల లెక్కల ప్రకారం ఉంటుంది.ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారు.ఎల్‌పీజీ ధర నిర్ణయించేటపుడు అందులో ఫ్రీ ఆన్‌ బోర్డ్‌(ఎఫ్‌ఓబీ) ప్రైజ్, ఓషన్‌ ఫ్రైట్, కస్టమ్‌ డ్యూటీస్, పోర్ట్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌ కాస్ట్‌ ఇతర ఛార్జీలను కూడా జత చేసి లెక్కిస్తారు.

ఎల్‌పీజీ ధరలు అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్, ముడిసరుకు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార తాయి.అవి యూఎస్‌ డాలర్లలో లెక్కించి, ఇండియన్‌ రూపీకి మారుస్తారు.

మీరు ఎంత చెల్లిస్తారంటే

Telugu Crude, International, Ipp Formula, Lucknow-Latest News - Telugu

ఈ అంతర్జాతీయ ధరలకు, దేశీయ ఛార్జీలకు కూడా కలిపి లెక్కిస్తారు.అంటే ఇన్‌లాండ్‌ ఫ్రైట్‌ కాస్ట్, ఆయిల్‌ కంపెనీ మార్జిన్, బాటిలింగ్‌ కాస్ట్, మార్కెటింగ్‌ ఎక్స్‌పెన్స్‌స్, డీలర్‌ కమీషన్, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) ఇవన్ని కలిపిన తరువాత రిటైయిల్‌ అమ్మకపు ధరతో దేశవ్యాప్తంగా ఉన్న నాన్‌ సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు విక్రయిస్తారు.చాలా మందికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌లపై సబ్సిడీని అందిస్తోంది.వీటి ధరలు కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.ప్రధాన్‌ మంత్రి ఉజ్జల్‌ యోజనా పథకం ద్వారా కేంద్రం ఉచిత ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లను బీపీఎల్‌ మహిళకు అందిస్తోంది.

ధరలు ఎందుకు పెరుగుతాయి?

భారతీయ ఎల్‌పీజీ ధరలు ఐపీపీ పై ఆధారపడి ఉంటుంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో ఆటోమెటిగ్గా ఇండియన్‌ రూపీ వ్యాల్యూ తగ్గుతుంది.దీంతో ధరలు సవరిస్తారు.డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేవలం 15 రోజుల్లోనే 11 శాతం ధరలు పెరిగాయి.తాజాగా నాన్‌ సిబ్సిడీ ఎల్‌పీజీ ధరలు ఢిల్లీ, ముంబైలలో రూ.859.50 .చెన్నై రూ.875.50, కోల్‌కతా రూ.886.50, అత్యధికంగా లక్నోలో ఎక్కువ ధర రూ.897 వద్ద ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube