బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న చాలామంది పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై సందడి చేస్తున్నారు.
అదేవిధంగా మరికొందరు కమెడియన్లు ఏకంగా హీరోలుగా సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇప్పటికే “త్రీ మంకీస్” , “సాఫ్ట్ వేర్” సినిమాల ద్వారా సుడిగాలి సుదీర్ హీరోగా పరిచయం అయ్యారు.
సుధీర్ బాటలోనే మరొక కమెడియన్ గెటప్ శీను కూడా వెండితెరపై హీరోగా సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో కృష్ణమాచారి దర్శకత్వంలో “రాజు యాదవ్“అనే సినిమాలో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.ఇందులో గెటప్ శీను స్వీటీ అంటూ ఒక కాలేజీ అమ్మాయి వెంటపడతాడు.ఆ తర్వాత తీవ్రమైన రక్తంతో నడవలేని స్థితిలో గెటప్ శీను కనపడటం ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ సినిమాపై ఆసక్తిని నెలకొల్పుతుంది.