`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సెట్లో హీరోయిన్ కృతిశెట్టి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌..

`సమ్మోహనం`, `వి` చిత్రాల త‌ర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో రూపోందుతోన్న మూడో చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్.

 Heroine Kritishetti Birthday Celebrations On The Set Of `tell You About That Gir-TeluguStop.com

ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో సాంగ్ షూట్ చేస్తున్నారు.ఈ రోజు హీరోయిన్ కృతి శెట్టి పుట్టిన‌రోజు కావ‌డంతో లొకేష‌న్ లోనే కృతిశెట్టి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపారు చిత్ర యూనిట్‌.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది.

గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి.మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్ మార్తాండ్ కె.వెంక‌టేష్‌.సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.అవ‌స‌రాల‌ శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube