ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోగా ఎదిగాడు నాని.తన చక్కటి నటనతో అతి తక్కువ కాలంలోనే నేచురల్ స్టార్ అనే పేరును సంపాదించాడు.నాని సినిమాలంటే యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది.తన సూపర్ యాక్టింగ్ తో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.పలు రకాల సినిమాల్లు వెరైటీ పాత్రలు పోషించాడు.అందరి చేత ప్రశంసలు పొందాడు.
అయితే ఈ యంగ్ హీరోకు ఓ సూపర్ లవ్ స్టోరీ ఉందట.అదీ రియల్ లైఫ్ లో.ఇంతకీ తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ నేచురల్ స్టార్ లవ్ లో పడింది మరెవరితోనో కాదు.ప్రస్తుతం తన భార్య అంజనాతోనే.అప్పట్లో నాని.అంజనా ఎఫ్ఎంలో పనిచేసేది.ఆ సమయంలో అంజనాతో లవ్ ట్రాక్ నడిపాడు.అంతేకాదు.తనను పికప్ చేసుకునేందుకు గంటల తరబడి వెయిట్ చేసేవాడట.
తొలుత స్నేహంగా ఉన్న వీరి పరిచయం ఆ తర్వాత మరింత ముదిరిందట.కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టుకోలేదు.
వీరి ప్రేమ గురించి కేవలం దగ్గరి మిత్రులకు మాత్రమే తెలుసు.ఈ విషయం నెమ్మదిగా ఇరు కుటుంబాలకు సైతం తెలిసింది.
అయినా వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.అబ్బాయి మంచి వాడు కావడంతో అమ్మాయి బంధువులు కూడా ఎలాంటి తిరకాసు పెట్టలేదు.2012లో వీరి పెళ్లి సాదాసీదాగా జరిగింది.
అసిస్టెంట్ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన నాని.నెమ్మదిగా హీరోగా మారాడు.అనంతరం టాప్ హీరోగా ఎదిగాడు.
సినిమా పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉంటూ ఎంతో మంది మిత్రులను సంపాదించుకున్నాడు.అప్పట్లో నాని- అంజనా ఎంగేజ్ మెంట్ వీడియో బాగా పాపులర్ అయ్యింది.
ఈ దంపతులకు 20178లో ఓ అబ్బాయి పుట్టాడు.తనకు అర్జున్ అని పేరు పెట్టారు.అందుకే జెర్సీ సినిమాలో తన పాత్రకు కూడా అర్జున్ అని పేరు పెట్టుకున్నాడు
.