ధనుష్ వెంకీ అట్లూరి సార్ పోస్టర్..!

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా తెరకెక్కుతుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరక్షన్ చేస్తున్నారు.

 Dhanush Venky Atluri Sir Movie Title Teaser Released Details, Hero Dhanush, Dhan-TeluguStop.com

ఈ సినిమాకు సార్ అనే టైటిల్ తమిళంలో వాతి అని ఫిక్స్ చేశారు.విద్యా వ్యవస్థలోని లోపాలని ఎత్తి చూపేలా ఈ సినిమా కథ పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.

ఇంతవరకు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను తీసిన వెంకీ అట్లూరి డైరక్టర్ గా కెరియర్ లో మొదటిసారి ఒక సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నారని చెప్పొచ్చు.

ధనుష్ చేస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే అవడం విశేషం.

సార్ సినిమా టైటిల్ రివీల్ సందర్భంగా  రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమాపై ఎక్సయిట్ మెంట్ పెంచేలా చేసింది.టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బ్యానర్ లలో సితార బ్యానర్ కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్ గా క్రేజ్ తెచ్చుకుంది.

అలాంటి బ్యానర్ లో ధనుష్ చేస్తున్న ఈ సార్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.త్రివిక్రమ్​ భార్య సాయి సౌజన్య నిర్మాత భాగస్వామ్యం అవడం ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube