ఆ కుటుంబంలోని వారు అంత పొడ‌వుగా ఎందుకు ఎదుగుతున్నారంటే..

అమెరికాలో అత్యంత పొడవైన‌ వ్యక్తులున్న ఆ కుటుంబం గిన్నిస్ రికార్డుల‌కెక్కింది.ఈ కుటుంబంలో ఒక వ్యక్తి సగటు ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు.

 Meet The Worlds Tallest Family Details, Tallest Family, Worlds Tallest Family, T-TeluguStop.com

ఆ ఇంట్లో అత్యంత పొడ‌వైన‌ వ్యక్తి పేరు ఆడమ్ ట్రాప్స్. 22 ఏళ్ల ఆడమ్ ఎత్తు 7 అడుగుల 3 అంగుళాలు.

ఇంట్లో పొట్టిగా ఆడమ్ తల్లి క్రిస్సీ ఉన్నారు.ఆమె ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు.

ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన ఈ కుటుంబంపై చర్చ జరుగుతోంది.మిన్నెసోటాలో ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు చాలా ఎత్తుగా ఉన్నందున వారికి కొన్ని ప్రతికూలతలు ఎదుర‌వుతున్నాయి.

పొడుగ్గా ఉండటం కార‌ణంగా ఎన్నో క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సవన్నా.6 అడుగుల 8 అంగుళాల పొడవు. మనం పొడవుగా ఉన్నప్పుడు, మనం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వ‌స్తుంది.

పొడవు కారణంగా వారి పాదాలకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి.ఒక్కసారిగా లేచి నిలబడితే స్పృహ తప్పుతుంటుంది.

వేగంగా పరిగెత్తితే పడిపోతానేమోనని భయం నెల‌కొంటుంది.గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న సవన్నా తండ్రి స్కాట్‌ మాట్లాడుతూ.

‘‘నేను ఒకటవ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్‌ కంటే ఎత్తుగా ఉండేవాడిని.

Telugu Adam Traps, America, Crissy, Savanna, Scott, Person, Worlds-Latest News -

పొడుగ్గా ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.కొత్త వ్యక్తులు మ‌మ్మ‌ల్ని క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తారు.మా ఎత్తు వారికి ఎలా నచ్చిందో చెబుతారు.

మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామ‌ని, నచ్చిన బట్టలు కొనలేమ‌ని, కారు నడపలేమ‌ని తెలిపాడు.డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం 2018లో ఇలాంటి ఒక రికార్డు నెల‌కొల్పారు.

టర్కీ నివాసి సుల్తాన్ కోసెన్ 8 అడుగుల 3 అంగుళాల పొడవుతో ఉన్నాడు.ప్రపంచంలోనే అత‌ను అత్యంత ఎత్త‌యిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెల‌కొల్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube