2021లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్ళే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోల రేంజ్ బాగా దూసుకుపోతుంది.ప్రతి ఒక్కరు వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటున్నారు.

 Here Are The Highest Remuneration Tollywood Star Heroes In 2021, Heigh Remunerat-TeluguStop.com

ఇక స్టార్ హీరోల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఏకంగా పాన్ ఇండియా సినిమాలతోనే దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఏడాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ హీరోల లిస్ట్ బయటపడింది.ఇంతకు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

ప్రభాస్: టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా ఉంది.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.

ఈయన పారితోషకం ఒక్క సినిమాకు 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు ఉంది.

జూనియర్ ఎన్టీఆర్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈయన ఒక సినిమాకు 50 కోట్ల నుండి 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

రామ్ చరణ్: టాలీవుడ్ మెగా యంగ్ స్టార్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా సినిమా తో బిజీగా ఉన్నాడు.ఈయన ఒక్క సినిమాకు 50 కోట్ల నుండి 90 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నాడు.

మహేష్ బాబు: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇక ఈయన కూడా ఒక సినిమాకు 60 కోట్ల నుండి 70 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో వరుస సినిమా లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఈయన దాదాపు ఒక సినిమాకు 50 కోట్ల నుండి 65 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నాడు.

చిరంజీవి: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న కూడా ఈయన పారితోషకం మామూలు స్టార్ హీరోలకు ఉన్నట్టే ఉంది.ఈయన కూడా ఒక సినిమాకు 50 కోట్ల నుండి 60 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

అల్లు అర్జున్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈయన కూడా ఒక సినిమాకు 40 నుండి 60 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండ: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక ఈయన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగి ఒక సినిమాకు 15 నుండి 30 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు.

రవితేజ: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ గురించి అందరికీ తెలిసిందే.ఈయన కూడా స్టార్ హీరోగా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈయన కూడా ఒక సినిమాకు 15 నుండి 20 కోట్లు అందుకుంటున్నాడు.

నాని: నాచురల్ స్టార్ హీరో నాని వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇక ఈయన కూడా ఒక సినిమాకు 13 కోట్ల నుండి 20 కోట్ల వరకు అందుకుంటున్నాడు.

వరుణ్ తేజ్: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకెళ్తున్నాడు.ఈయన ఒక్క సినిమాకి కేవలం 15 కోట్లు మాత్రమే అందుకుంటున్నాడు.

వెంకటేష్ దగ్గుబాటి: విక్టరీ వెంకటేష్ ఇటీవలే వరుస సక్సెస్ లతో బాగా పేరు సంపాదించుకున్నాడు.ఈయన కూడా ఒక్క సినిమాకు 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నాడు.

నందమూరి బాలకృష్ణ: ఇటీవలే అఖండ సినిమాతో మంచి సెన్సేషనల్ హిట్ సంపాదించుకున్న బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన ఒక్క సినిమాకు 9 నుండి 15 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

నాగ చైతన్య: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం స్టార్ హోదా కోసం పోరాడుతున్నాడు.ఇక ఈయన ఒక సినిమాకు 7 నుండి 12 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

అఖిల్: తన అన్న లాగే అఖిల్ కూడా స్టార్ హోదా కోసం తెగ ఆరాటపడుతున్నాడు.ఈయన కూడా తన తండ్రితో పాటు ఒక సినిమాకు దాదాపు 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు.

నితిన్, రామ్ పోతినేని: ప్రస్తుతం ఈ యంగ్ హీరోలు ఇద్దరు ఒక సినిమాకు 8 నుండి పది కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు.ప్రస్తుతం తమ తమ సినిమాలలో బిజీగా ఉన్నారు.

సాయి ధరమ్ తేజ్: సాయి ధరమ్ తేజ్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఈయన కూడా ఒక సినిమాకు 7 నుండి 10 కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నాడు.

రానా దగ్గుబాటి: టాలీవుడ్ యంగ్ హీరో రానా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇక ఈయన ఒక సినిమాకు 5 కోట్ల నుండి 10 కోట్ల వరకూ పారితోషకాన్ని అందుకుంటున్నాడు.

Tollywood Top Highest Paid Actors in

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube