తేజ సజ్జా , ప్రశాంత్ వర్మ( Teja Sajja, Prashanth Verma ) కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.అయితే ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అయింది.
హనుమంతుని ఆశీస్సులతో హనుమాన్ మూవీ( Hanuman movie ) సత్తా చాటిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ మూవీపై భారీగా అంచనాలు నెలకొనడం వల్లే ఈ మూవీ సులువుగా బ్రేక్ ఈవెన్ అయిందని తెలుస్తోంది.
సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
నా సామిరంగ సినిమాకు( na Samiranga movie ) సైతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.ఈ సినిమాకు బుకింగ్స్ సైతం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.
సంక్రాంతి విజేతలు హనుమాన్, నా సామిరంగ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించడంతో పాటు భారీ లాభాలను అందిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.సోమవారం నుంచి హనుమాన్, నా సామిరంగ సినిమాలకు థియేటర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.థియేటర్లు పెరగకపోయినా ఈ సినిమాలకు థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పవచ్చు.
సంక్రాంతి పండుగకు ఎక్కువ బడ్జెట్ సినిమాల కంటే మంచి కంటెంట్ సినిమాలే సత్తా చాటాయి.
నా సామిరంగ నాగార్జునకు మాస్ కమ్ బ్యాక్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్, నా సామిరంగ సినిమాల లాభాలు సైతం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ సాధించడం అంటే టాలీవుడ్ కు మంచి రోజులు మొదలయ్యాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.