ఫ్రీస్టైల్ మోటోక్రాస్ స్పోర్ట్స్( Freestyle motocross sports ) చూసేందుకు రెండు కళ్ళు చాలవు.వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చాలామందిని ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ కోవకు చెందిన మరొక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతోంది.మోటోక్రాస్ స్పోర్ట్స్‌లో వేగం కంటే రైడర్లు ఆర్టిస్టిక్, క్రియేటివ్ స్టంట్స్ పైనే దృష్టి పెడతారు.
రైడర్లు గాలిలో ఫ్లిప్ చేయడం, స్పిన్ తిరగడం వంటి వివిధ విన్యాసాలు చేయడం ద్వారా వారి స్కిల్స్, శైలిని ప్రదర్శిస్తారు.
అయితే వైరల్ అవుతున్న వీడియోలో బైకర్ ( Biker )చాలా పైకి వెళ్లాక బైక్ పై నుంచి ఎగిరి గుండ్రంగా తిరిగాడు.ఆపై మళ్లీ బైక్ పై కూర్చున్నాడు.ఈ స్పోర్ట్స్ చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు.
ఈ ఫ్లిప్ చూసి వారికి చాలా భయమేసింది.వారు చాలా భయంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం మనం వీడియోలో చూడవచ్చు.
ఈ స్టంట్ చేయడం మామూలు విషయం కాదు.కొంచెం తేడా వచ్చినా చాలా అడుగుల ఎత్తు పైనుంచి కింద పడే ప్రమాదం ఉంది దానివల్ల ఎముకలు విరిగిపోవచ్చు.
అందుకే పేరెంట్స్ బాగా భయపడిపోయారు.స్టంట్ పర్ఫెక్ట్ గా చేసి ల్యాండ్ అయ్యేటప్పుడు వారు ఊపిరి పీల్చుకోవడం మన వీడియోలో చూడవచ్చు.
ఆల్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటిదాకా ఒక కోటి 12 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.సాధారణంగా ఫ్రీస్టైల్ మోటోక్రాస్ ఈవెంట్లు ఈవెంట్ ఉద్దేశ్యాన్ని బట్టి పోటీ లేదా ప్రదర్శన కావచ్చు.పోటీ ఈవెంట్లలో రైడర్ల ట్రిక్‌ల ఎగ్జిక్యూషన్ ఆధారంగా స్కోర్స్ ఇస్తారు.ఎగ్జిబిషన్ ఈవెంట్లలో వినోద ప్రయోజనాల కోసం బైకర్స్ స్టంట్స్ చేస్తారు.