అవును, ఇక రీల్స్ చేసేవారు మరింత రెచ్చిపోవచ్చు.ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా( Meta ) భారతదేశంలోని వ్యాపారులకు ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
దేశంలోని ఫ్యాషన్, ఫుడ్, బ్యూటీ వంటి ప్రతి రంగంలోని వ్యాపారాలకు రీల్స్‌లో యాడ్స్ ఇచ్చేలా వీలు కల్పిస్తోంది.ఈ మేరకు “మెడాన్ రీల్స్”( Medan Reels ) అనే కొత్త ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్టు ప్రకటించింది.
దీని ద్వారా కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను 30-సెకన్ల వీడియో రీల్స్‌లో చూపించవచ్చు.ఇక్కడ రీల్స్ అంటే టిక్‌టాక్ లాంటి షార్ట్-వీడియో ప్లాట్‌ఫామ్ అని అర్ధం చేసుకోండి.

దీనిని మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో( Facebook, Instagram ) పరిచయం చేసింది.దీని ద్వారా క్రియేటర్స్ పెద్దమొత్తంలో లాభపడనున్నారు.దాంతో మెడాన్ రీల్స్ ప్రోగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్‌కి ఆదాయ అవకాశాలు సృష్టింపబడతాయి.ఈ నేపథ్యంలోనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రీఫ్ ఈ ప్రోగ్రామ్‌లో చేరమని, ప్లాట్‌ఫామ్‌లో తమ పరిధిని విస్తరించుకోమని వివిధ పరిశ్రమల నుంచి బ్రాండ్‌లను ఆహ్వానిస్తోంది.
ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోవడానికి, మెరుగైన వ్యాపార ఫలితాలను సాధించడంలో వారికి సహాయపడుతుంది.

బర్ఖా సింగ్, విరాజ్ ఘేలాని, రూహి దోసాని వంటి పలువురు ప్రముఖ క్రియేటర్స్ ‘హ్యాష్‌ట్యాగ్ మేడ్ హానరబుల్స్’( Hashtag Made Honorable ) కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.ఈ ప్రోగ్రామ్‌తో రీల్స్ పాపులారిటీని మరింత విస్తరింపజేయాలని మెటా టార్గెట్ పెట్టుకుంది.మెటా ఇండియాలో అడ్వర్టైజింగ్ బిజినెస్ డైరెక్టర్, హెడ్ అరుణ్ శ్రీనివాస్ ఈ విషయమై మాట్లాడుతూ.
రీల్స్ యాడ్స్ క్రియేటివ్ కంటెంట్‌తో బ్రాండ్ వృద్ధిని పెంచుతాయని, మార్కెటింగ్ లక్ష్యాలను సాధించగలవని చెప్పారు.అదేవిధంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షలమంది క్రియేటర్లకు లాభం చేకూరనుందని చెప్పుకొచ్చారు.