హెచ్ 4 EAD పై - గుడ్ న్యూస్..

గతకొంతకాలంగా భారతీయ ఐటీ నిపుణుల్ని కలవరపెడుతున్న H4 EAD రద్దు అంశంపై కొంత ఊరటనిచ్చే వార్త ఇచ్చింది అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ.అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది.

 హెచ్ 4 Ead పై – గుడ్ న్యూస్..-TeluguStop.com

ఈ హామీతో ఎన్నారైలలో ముఖ్యంగా భారతీయులలో సంతోషం వెల్లివిరుస్తోంది.సరే అసలు విషయంలోకి వెళ్తే.

హెచ్‌ 4 EAD వీసా రద్దుపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని.ఈ విషయంలో ఎవరూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదని…ఈ ప్రతిపాదనపై కార్పొరేట్లు, చట్టసభల ప్రతినిధులు కూడా ఆందోళన చెందనవసరం లేదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటన చేసింది…ఈ మేరకు యూఎస్‌సీఐఎస్‌ ప్రతిపాదనలు రూపొందించగానే తాము ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది.

హెచ్‌ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు , అదేవిధంగా 21 ఏండ్లలోపు ఉండే పిల్లలకి ఈ హెచ్‌ 4 వీసా మంజూరు చేస్తారు.వీరు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వీలుంది…ఈ వీసా కింద ప్రస్తుతం 70 వేల మందికి పైగా భారతీయ మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.ఒక వేళ ట్రంప్ నిబంధనల్ని అమలుచేస్తే వీరందరూ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది…అయితే తాజా ప్రకటనతో ఇప్పుడు విదేశీ ఉద్యోగులకి కొంత ఊరట లభించినట్టు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube