బాబు మాకొద్దు బాబోయ్..!!!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి గడ్డుకాలం మొదలయ్యింది.వచ్చే ఎన్నికల్లో బాబు ఏపీలో ఏకాకిగా మిగిలిపోనున్నారట.

అందుకు తగ్గట్టుగా రాజకీయాలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయని.చంద్రబాబు ని ఒంటరి చేయడానికి బీజేపీ ముందునుంచీ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు కలిసొస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.

గత ఎన్నికల్లో జనసేనుడి మద్దతుతో ఎన్నికల బరిలోకి దూకిన బాబు ఈ సారి కనీసం వామపక్షాల మద్దతు నైనా సరే ముందుకు వెళ్లాలని అనుకున్నారు అయితే.

అందుకోసం బాబు లోకల్ కామ్రేడ్స్ తో ఈ విషయం మాట్లాడితే కష్టమని అక్కడ నుంచీ కథని నరుక్కురావాలని.ఏపీలో కామ్రేడ్స్ ని కల్వకుండా బాబు జాతీయ స్థాయిలో ఎర్రదండు నేతలను కలిశారు అయితే ఈ కళాయికకి కారణం బీజేపీ వ్యతిరేకులని కూడగట్టడమే అయినా ఏపీలో కామ్రేడ్స్ తనపక్కన నిలబెట్టుకోవచ్చు అనుకున్నారు.కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

Advertisement

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తో పొత్తు పెట్టుకోమని కామ్రెడ్స్ తేల్చి చెప్తున్నారు.బాబు మార్క్ పాలిటిక్స్ ని తాము నమ్మమని, మద్దతు కూడా ఇవ్వమని తెగేసి చెబుతున్నారు.

ఇదిలాఉంటే తెలంగాణా రాష్ట్రంలో మహా కూటమి కట్టామని, అక్కడ కేసీఆర్ ని ఓడించడమే తమ లక్ష్యమని ఏపీ సీపీఐ నేత రామక్రిష్ణ అన్నారు.అయితే మహా కూటమిలో తమతో పాటు టీడీపీ కూడా ఓ భాగస్వామి తప్ప మేము టీడీపీ ఒక్కటి కాదని ఆయన చెప్పడంతో బాబు గొంతులో కరక్కాయ పడినట్టు అయ్యింది.

అక్కడితో ఆగకుండా ఏపీలో టీడీపీ ని గద్దె దించడమే మా ధ్యేయమని అంటూ షాక్ ఇచ్చారు.అక్కడితో ఆగకుండా తాము జనసేన తో కలసి కూటమి కడతామని, ఆ విధంగా ముందుకు పోతామని రామక్రిష్ణ సెలవిస్తున్నారు.

దాంతో ఒక్కసారిగా బాబు కి ఫ్యూజులు మాడిపోయాయి.బీజేపీతో ఇన్నాళ్ళూ రాసుకు పూసుకు తిరిగి ఇపుడు బయటకు వస్తే తాము నమ్మమని కూడా ఆయన చెబుతున్నారు.విభజన హామీలు అమలు కాకపోవడానికి బీజేపీతో పాటు టీడీపీ పాత్ర కూడా ఉందని ఆయన విమర్శిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అక్కడితో ఆగకుండా ఎన్నికలు రానేలేదు అప్పుడు బాబు ఓట్ల రాజకీయం మొదలు పెట్టాడు అంతో విమర్శించారు.దాంతో ఎర్రన్నలతో కలిసి వెళ్లాలని అనుకున్న బాబు కలలు కల్లలు అయ్యిపోయాయి.

Advertisement

మరి బాబు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారా లేదా మరేదైనా ఎత్తులు వేస్తారు అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు