గొంతు తడుపుకోవడానికైనా మంచినీళ్లు ఇవ్వాలి..: హరీశ్ రావు

తెలంగాణలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ట్విట్టర్ వేదికగా స్పందించారు.రాష్ట్రంలో మంచి నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని ట్వీట్ లో తెలిపారు.

 Fresh Water Should Be Given Even For Gargling..: Harish Rao, Brs , Ts Politics-TeluguStop.com

మరి కొన్ని ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు.నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారన్న ఆయన గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలు అయ్యాయని విమర్శించారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటువంటి దుస్థితి ఏనాడూ చూడలేదని చెప్పారు.తమ హయాంలో మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.

పంటలకు సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కనీసం ప్రజలకు గొంతు తడుపుకోవడానికైనా మంచినీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube