ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది డిఫ్రెషన్ బారిన పడుతున్నారు.పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ప్రేమించిన వారు దూరం కావడం, పని ఒత్తిడి, ఇతరుల నుంచి వేధింపులు, కోరుకున్న రంగంలో సక్సెస్ అవ్వకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడతారు.
దీని వల్ల మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం సైతం దెబ్బ తింటుంది.అందుకే డిప్రెషన్‌ను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతుంటారు.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేటెందుకు ఆ సూపర్ డ్రింక్ ఏంటో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కాచి చల్లార్చిన పాలు వేసి గంట పాటు నానబెట్టుకోవాలి.అలాగే మరో గిన్నెలో హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు, వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి, కుంకుమ పువ్వు పాలు మరియు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి బాగా కలుపుకోవాలి.చివరిగా అందులో ఒకటిన్నర గ్లాస్ కాచిన ఫ్యాట్ లెస్ మిల్క్, వన్ టేబుల్ స్పూన్ బాదం పలుకులు, వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, వన్ టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు వేసి మరోసారి కలిపితే సబ్జా కేసర్ షేక్ సిద్ధం అవుతుంది.

అదిరిపోయే రుచిని కలిగి ఉండే ఈ డ్రింక్‌ను తరచూ తీసుకుంటే డిప్రెషన్ సమస్య వదిలిపోతుంది.మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.అంతేకాదండోయ్.ఈ సబ్జా కేసర్ షేక్ ను తీసుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది.అంగస్తంభన సమస్యలు దూరం అవుతాయి.వెయిట్ లాస్ అవుతారు.
చర్మం నిగారింపుగా మారుతుంది.మరియు గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.
కాబట్టి, ఈ డ్రింక్‌ను అస్సలు మిస్ అవ్వొద్దు.