టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddu jonnalagadda ) హీరోగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్( Tillu Square ) .అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
మల్లిక్ రాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
గత నెల మర్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించింది.ఈ సినిమా రికార్డుల మీద రికార్డు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను సాధిస్తోంది.
రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.అదే ఊపుతో మిలియన్ క్లబ్ లోకి, ఆ వెంటనే 2 మిలియన్ క్లబ్ లోకి వెళ్లిపోయింది.ఒక వైపు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం, మరోవైపు పోటీకి వచ్చిన మరో సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో, టిల్లూ స్క్వేర్ కు ఎదురే లేకుండా పోయింది.అలా ఇప్పటివరకు ఓవర్సీస్ లో 2.9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ఈ సినిమా, మరికొన్ని గంటల్లో 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది.అలాగే సిద్దు వాల్తేరు వీరయ్య, భీమ్లా నాయక్, పుష్ప, గుంటూరుకారం( Waltheru Veeraiah, Bhimla Naik, Pushpa, Gunturukaram ) సినిమాలు ఓవర్సీస్ లో సాధించిన వసూళ్లను అధిగమించాడు.
వరల్డ్ వైడ్ వసూళ్లలో ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని, తాజాగా 125 కోట్ల గ్రాస్ కూడా సాధించింది.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న స్పందనను బట్టి చూస్తుంటే ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించడం ఖాయం అని తెలుస్తోంది.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు హీరో సిద్దు జొన్నలగడ్డ.కాగా మొదట్లో ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు హీరోయిన్ అనుపమపై భారీగా ట్రోల్స్ చేయడంతో పాటు నెగటివ్ గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
కానీ సినిమా విడుదల తర్వాత అనుపమను తిట్టిన నోర్లే మెచ్చుకున్నాయి.