గొంతు తడుపుకోవడానికైనా మంచినీళ్లు ఇవ్వాలి..: హరీశ్ రావు
TeluguStop.com
తెలంగాణలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
రాష్ట్రంలో మంచి నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని ట్వీట్ లో తెలిపారు.మరి కొన్ని ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని హరీశ్ రావు వెల్లడించారు.
నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారన్న ఆయన గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలు అయ్యాయని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటువంటి దుస్థితి ఏనాడూ చూడలేదని చెప్పారు.తమ హయాంలో మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు.
పంటలకు సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కనీసం ప్రజలకు గొంతు తడుపుకోవడానికైనా మంచినీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!