కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలంలోని ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు వేసిన పంటలు పత్తి, వేరుశనగ, ఆముదము తదితర పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని, ఇన్పుట్ సబ్సిడీ పంట భీమ రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాది రైతుల పక్షపాతి ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారని పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఉందని అన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి ఏటా ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా సకాలంలో వస్తూ ఉండేవి అని వస్తుండేవి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇన్పుట్ సబ్సిడీ అనే పదమే రైతులు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.