ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో సినిమాలకు ఎంతో క్రేజ్ వుంటుంది.ఇలాంటి సినిమాలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తిగా చూస్తారు.
అయితే ఇప్పటి వరకు ఇలాంటి సూపర్ హీరో సినిమాలు కేవలం హాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి.ఇలాంటి చిత్రాలు ఇండియాలో రావడం చాలా తక్కువ.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ నటించిన క్రిష్ చిత్రం ఎంతో పాపులారిటీ దక్కించుకుంది.
ఇప్పటికే హృతిక్ రోషన్ నటించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతుంటారు.
ఇలాంటి చిత్రాలకు ఎక్కువ ఆదరణ ఉండటంతో ఈసారి ఇండియాలోనే ఈ విధమైనటువంటి సూపర్ హీరో చిత్రాన్ని నిర్మించడానికి మలయాళ ఇండస్ట్రీ సిద్ధమయింది. టోవినో థామస్ హీరోగా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌హీరో మూవీ మిన్నల్ మురళి .
సోఫియా పాల్ నిర్మిస్తున్నటువంటి ఈ సూపర్ హీరో మూవీ నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.ఎటువంటి బాధ్యతలు లేని ఒక కుర్రాడి పై పిడుగు పడితే అతనికి ఏమీ కాకపోగా అతనికి ఎన్నో అద్భుతమైన శక్తులు లభిస్తాయి ఈ శక్తులతో ఆ కుర్రాడు ఎలాంటి పనులను చేస్తాడు అనే విషయంపై ఈ సినిమా తెరకెక్కిందని ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించారు.