ఢిల్లీలో సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు కదం తొక్కుతున్నారు.దీంతో సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పంటలకు కనీస మద్ధతు ధర కల్పించాలని కోరుతూ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.డిమాండ్లు పరిష్కరించేంత వరకు వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ఢిల్లీ( Chalo Delhi )లోకి ప్రవేశించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించిన భద్రతా బలగాలు రైతులు( Farmers ) రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.మరోవైపు ఇవాళ రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు నిర్వహించనుంది.ఈ మేరకు చండీగఢ్ లో సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్ మరియు నిత్యానంద రాయ్ రైతులతో చర్చలు జరపనున్నారు.