జీవనాధారమైన నీరు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

జలమే జీవం అనేది జలం గొప్పతనాన్ని తెలియజేస్తుంది.మనలో చాలా మంది ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు, స్నానం చేసుకునేటప్పుడు, పళ్లు తోముకునేటప్పుడు కుళాయి నీటిని అలానే వదిలేస్తుంటారు.

 Facts About Water, Water , Africa , India, Hydrogen , Oxygen , Sea , Rivers , C-TeluguStop.com

అనవసరంగా నీరు పోతున్నప్పటికీ అస్సలు పట్టించుకోరు.ఇప్పుడు నీటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఆఫ్రికాలోని చాలా మంది ప్రజలు ప్రతిరోజూ 5 కి.మీ నుండి 30 కి.మీ ప్రయాణించి తాగడానికి, స్నానం చేయడానికి, ఇతర ఉపయోగాలకు నీటిని తీసుకువస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది.

ముంచుకొస్తున్న వేసవిలోఈ పరిస్థితి సాధారణంగా కనిపించనుంది.నీరు.హైడ్రోజన్ (H) మరియు ఆక్సిజన్ (O) అనే రెండు మూలకాలతో రూపొందింది.2 హైడ్రోజన్ + 1 ఆక్సిజన్ = H2O,భూమి ఉద్భవించిన కొంత కాలం తర్వాత, నీటితో నిండిన లేదా మంచుతో కూడిన తోకచుక్కలు, ఉల్కల ద్వారా భూమిపై వర్షం కురిసిందని, ఇది మహాసముద్రాలను ఏర్పరిచిందని భావిస్తారు.

అదే సమయంలో మరొక సిద్ధాంతం ప్రకారం మంచు యుగంలో నీరు రాళ్ళు, కందకాలలో నిక్షిప్తం అయ్యిందని, తరువాత వాటి నుండి మహాసముద్రాలు ఏర్పడ్డాయని కూడా చెబుతారు.భూమిపై ఒక బిలియన్ 40 క్యూబిక్ కిలోలీటర్ల నీరు ఉంది.ఇందులో 97.5% నీరు లవణ సంబంధమైన సముద్రంలో ఉంది.1.5% మంచినీరు ధ్రువ ప్రాంతాలలో మంచు రూపంలో ఉంది.మిగిలిన 1% నదులు, సరస్సులు, బావులు, నీటి బుగ్గలలోని మంచినీరుగా ఉంది.ఈ 1% నీటిని 60% వ్యవసాయం, పరిశ్రమలు, కర్మాగారాలు మొదలైన వాటికి వినియోగిస్తున్నారు. మిగిలిన 40% తాగడానికి, వంట చేయడానికి, స్నానాలకు, బట్టలు ఉతకడానికి, శుభ్రపరచడానికి వినియోగిస్తున్నారు.చైనాలోని దాదాపు 700 మిలియన్ల మంది ప్రజలు అపరిశుభ్రమైన నీటిని తాగాల్సి వస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మురుగు నీరు తాగడం వల్ల ప్రతి గంటకు 200 మంది చిన్నారులు మరణిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube