చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరువాత కొరియోగ్రాఫర్ గా కెరియర్ కొనసాగించి దర్శకుడుగా మారి సత్తా చాటుతున్న వ్యక్తి జి.అశోక్.
కొరియోగ్రాఫర్ గా అతను మాస్టర్, అన్నమయ్య, పెళ్లి, ఒసేయ్ రాములమ్మ లాంటి హిట్ సినిమాలకి పని చేశాడు.అయితే అప్పుడు పెద్దగా రాని గుర్తింపు దర్శకుడుగా మారిన తర్వాత వచ్చింది.
ఆకాశరామన్న సినిమాతో దర్శకుడు అవతారం ఎత్తిన అశోక్ నాని హీరోగా పిల్ల జమిందార్ సినిమాతో ఇండస్ట్రీలో మొదటి హిట్ కొట్టాడు.తరువాత కుటుంబ బంధాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా సుకుమారుడు సినిమా చేసిన అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
తరువాత అంజలితో చిత్రాంగద అనే డిఫరెంట్ కంటెంట్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించాడు.కంటెంట్ బాగున్నా ఎవరికీ పెద్దగా కనెక్ట్ కాలేదు.
తరువాత అనుష్కతో భాగమతి సినిమా తీశాడు.ఇదికూడా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే.
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని ఏకంగా యాబై కోట్లు కలెక్ట్ చేసింది.
ఇదే సినిమాతో అశోక్ హిందీలోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
అక్కడ భూమీ ఫడ్నేకర్ తో భాగమతిని దుర్గావతి టైటిల్ తో రీమేక్ చేశాడు.ఈ సినిమా త్వరలో ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే దర్శకుడు అశోక్ హిందీలో మరో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.నస్రత్ బరూచా, నోరా ఫతేహి ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమా డైలాగులు లేని మూకీ చిత్రంగా తెరకెక్కుతుంది.
త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.