ప్రజా స్వామ్యస్ఫూర్తి కి తిలోదకా లిస్తున్న పాలకులకు బీసీలు తమ చెమటను ధారపోసి సృష్టించిన సంపద కావాలి.వాళ్ళ ఓట్లతో అధికారం కావాలి కానీ, ప్రజాస్వామ్యంలో వారికి మాత్రం భాగస్వామ్యం కల్పించడానికిమాత్రం మనసు ఒప్పదు, పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని, దేశ జనాభా గణానంలో బీసీ ఉపకులాల గణన చేపట్టి విద్య,ఉద్యోగ,వైద్య,ఉపాధి,ఆ ర్దిక రాజకీయ పారిశ్రామిక, ప్రైవేటు రంగాలలో జనాభా దామా షా ప్రకారం, రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని దేశవ్యాప్తంగా బీసీలు నిత్యం, రాస్తారోకోలు ధర్నాలు నిరసనలు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న సమయం లో పార్లమెంటు ముట్టడి, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడి చేస్తున్నా 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడానికి వీలు లేదని, జవాబు ఇచ్చే ఆధిపత్య కులాల పాలకులు ఈ దేశంలో అగ్రవర్ణ కులాలు ఏడు శాతం ఉంటారు.
కానీ విద్య, వైద్యం, ఉపాధి, హార్దిక,పారిశ్రామిక, రాజకీయరంగాలతో పాటు 80 శాతం భూములు కూడా వారి ఆధీనంలోనే ఉన్నాయి.వారిలో రెండు శాతం మించి పేదలు లేరు, ఎవరు డిమాండ్ చేయకుండా నే అటాహసంగా 2019లో 123 వ రాజ్యాంగ సవరణ చేసి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో, 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించి రెండు శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తే సమంజసమే కానీ నాలుగు రెట్లు రిజర్వేషన్లను పెంచి చట్టబద్ధత కల్పించడం ముమ్మాటికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం,అయినా 50% రిజర్వేషన్ సీలింగ్ వి ధానం వీరికి వర్తించదా అంటే వడ్డించేవాడు.
మనవాడైతే కడబంతి లో కూర్చు న్న మన లడ్డు మనకు వస్తది అన్న సూక్తిని కేంద్ర ప్రభుత్వం అమలుపరిచింది , రెండవ మండల కమిషన్ చైర్మన్ బిందెశ్వర్ ప్రసాద్ మండల్ దేశం లో 1980 సంవత్సరంలోనే 52 శాతం బీసీలు ఉన్నారని , విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ,ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రపతికి నివేదిక అందజేశారు.

1990 ఆగస్టు 7న పార్లమెంటులో మండల్ కమిషన్ సూచించిన 40 సిఫారసులలోని ఒక సిఫారసును పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రకటించారు.వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని జీర్ణించుకోలేని ఆదిప త్య కులాలకు చెందిన, బిజెపి, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు తీవ్రంగా వ్యతిరేకించి, సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుదారులైన బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్నికూలదోసి బీసీల అస్తిత్వంపై దెబ్బ కొట్టారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పార్లమెంట్ లో ఆమోదించిన 27శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ ఉద్యమ నాయకులు సుప్రీంకోర్టులో దావా వేసి కేసు గెలిచిన తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో, 27% రిజర్వేషన్లు 1993 నుండి అమలవుతున్నాయి.
క్షేత్రస్థాయిలో 10% కూడా దాటడం లేదు, దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 16 రాష్ట్రాల్లో ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం ఆదిపత్య కులాల పాలకులు బీసీలను రాజకీయంగా చిన్నచూపు చూస్తున్నారానడానికిపెద్ద నిదర్శనం.