Superstar Krishna R. Narayana Murthy : ఇండస్ట్రీ అలా ఉండాలనుకున్నారు.. ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తాజాగా తుది శ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది.

 R Narayana Murthy Pays Tribute To Super Star Krishna, Super Star Krishna, Passed-TeluguStop.com

అలాగే కృష్ణ మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.కృష్ణ మరణ వార్త విన్న పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాదులోని నానక్ రామ్ గూడలోని కృష్ణ ఇంటికి ఒక్కొక్కరిగా చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు ఆర్ నారాయణ మూర్తి కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చి మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.హీరో కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే.సినీ పరిశ్రమలో ఆయన శకం ముగిసింది.

కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిని నింపిన కృష్ణ అంటూ కృష్ణ పై పొగడ్తలు కురిపించాడు ఆర్ నారాయణ మూర్తి.అందరికంటే ఎక్కువ కాదనే ఆత్మాభిమానాన్ని కృష్ణ చూపేవారని ఆయన తెలిపారు.

ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకున్న వ్యక్తుల్లో కృష్ణ కూడా ఒకరు.ఎంతోమంది నిర్మాతలు, దర్శకులను నిలబెట్టిన వ్యక్తి కృష్ణ అని గుర్తుచేసుకున్నారు.

Telugu Yana Murthy, Krishna, Tollywood-Movie

అల్లూరి సీతారామరాజుని అద్భుతంగా తీశారని ఎన్టీఆర్ ప్రశంసించారని మూర్తి గుర్తుచేసుకున్నారు.ఇకపోతే తాజాగా కృష్ణకి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే.కృష్ణ మరణం వార్త విని ఇటు అభిమానులు అటు రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube