Paruchuri Gopala Krishna : ఇల్లు కట్టుకునేందుకు కృష్ణగారు నాకు డబ్బు పంపారు.. పరుచూరి కామెంట్స్ వైరల్!

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా విడిచిన విషయం తెలిసిందే.కృష్ణ మరణ వార్తతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.

 Paruchuri Gopala Krishna About Super Star Krishna Help, Paruchuri Gopala Krishna-TeluguStop.com

అంతే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆయనే పేరే వినిపిస్తోంది.ఇప్పటికే కృష్ణ ఇంటికి చేరుకున్న పలువుడి సిని ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కృష్ణతో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా పంచుకుంటూ ఆయన గొప్పతనం గురించి వివరిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా పరుచూరి గోపాల కృష్ణ తనకి కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

అలాగే కృష్ణ తనకు చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనంటూ భావోద్వేగానికి లోనయ్యారు పరుచూరి.ఈ సందర్బంగా ఆయన కృష్ణ గురించి మాట్లాడుతూ.బంగారు భూమి సినిమాలో నాలుగైదు సీన్లకు డైలాగ్‌ రైటర్స్‌గా పని చేశాం. పీసీ రెడ్డి గారు సినిమా ఆరంభంలో పేరు వేయించుకోమన్నారు.

కానీ ఆ సినిమాకు పెద్ద రచయితలు పని చేశారు, వారి పక్కన మా పేరెందుకని వద్దన్నాను.ఈ సినిమా ఒక డైలాగ్‌ ఉంటుంది.

పద్మ.మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు.

మట్టిని నమ్మితే మన నోటికింత ముద్ద పెడుతుంది.ఆ మట్టికి నమస్కారం చేయి.

ఈ డైలాగ్‌ కృష్ణగారికి బాగా నచ్చింది.

Telugu Paruchurigopala, Krishna, Tollywood-Movie

వెంటనే ఎవరు రాశారని అడగడంతో అది నేనే అని పీసీరెడ్డి చెప్పారు.నేను ఇండస్ట్రీలో పెద్దవాడిని అవుతానని ఆయన అప్పుడు జోస్యం పలికారు.ఇండస్ట్రీలో ఆయన ఎంతోమందికి సహాయం చేశారు.

నాకు సినిమాలు లేని సమయంలో ఇల్లు కట్టుకోవడానికి ఆయన డబ్బులు పంపించారు.అది తీసుకున్న మరుసటి రోజే కొబ్బరికాయ కొట్టి ఇల్లు కట్టాను.

అందరికంటే ఎక్కువగా కృష్ణగారి 54 సినిమాలకు మా కలం ఉపయోగపడింది.ఆయన బంగారు మనసు మహేశ్‌ బాబుకు వచ్చింది అని కృష్ణ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు గోపాల కృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube