తెలుగులో ఇప్పటికీ ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.వాటితో పాటుగా డాన్స్ ప్రోగ్రాంలో కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
వాటిలో డాన్స్ ఐకాన్ షో కూడా ఒకటి.కాగా ఈ షో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.
ఈ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ దూసుకుపోతోంది.ఈ డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
కాగా ఈ షోలో శ్రీముఖి,యష్ మాస్టర్, సోహెల్ లు అలాగే ఈ షోకి రమ్యక్రిష్ణ,శేఖర్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు సోహెల్.
ఇక వచ్చి రావడంతోనే తన మాటలు యుద్ధం మొదలు పెట్టేసాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్‌కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు.
దాంతో వెంటనే హర్ట్ అయిన శ్రీముఖి అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది.అప్పుడు సోహెల్ అలా ఏమీ లేదు ఇది డాన్స్ ఐకాన్ షో అంటే ఎక్స్పెక్టింగ్ మోర్ అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్.
సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ మిస్ అయ్యిందని చెప్పాడు.ఆ తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి అసలు ఈ సమయంలో చేయాల్సిన పర్ఫామెన్స్ ఆ అంటూ ఫైర్ అయ్యారు.

దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. అప్పుడు సోహెల్ అలా మాట్లాడి ఉండకూడదు అనడంతో వెంటనే ఆమె కాస్త వెటకారంగా మాట్లాడుతుంది.అప్పుడు సోహెల్ నేను అలా అనమని చెప్పానా అని అనడంతో ఈ లోగా వెంటనే రమ్యకృష్ణ మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్‌లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది.అయితే ఇది నిజమా లేకపోతే జస్ట్ ఫన్నీ కోసం అలా చేశారా అన్నది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.







