టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన జరగనుంది.
అయితే కుప్పం పర్యటనకు రావడానికి ముందు చంద్రబాబు బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు విమానాశ్రయానికి( Bangalore Airport ) చేరుకున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.( DK Sivakumar ) చంద్రబాబుకి స్వాగతం పలకడం జరిగింది.
అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇచ్చిన డీకే శివకుమార్.
చంద్రబాబుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా తీసుకెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో వారిరువురూ ఏం మాట్లాడుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఇటీవల దక్షిణాదిలో కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గెలవడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.దీంతో చంద్రబాబుతో రహస్యంగా డీకే శివకుమార్ ముచ్చట్లు పెట్టడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ఆల్రెడీ జనసేన పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.