ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వైఎస్సార్సిపి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు నేతలు నివాళులు అర్పిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సిపి ఆధ్వర్యంలో ఇలాంటి పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అలాగే వైఎస్సార్ సమాధి దగ్గర కూడా ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి.
ఇడుపులపాయ ఘాట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు ఆయన భార్య వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు.
ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పక్కపక్కనే కూర్చుని పలకరించు కోవడం అందరి కంట్లో పడింది.
గత కొద్దీ రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.దీంతో వీరిద్దరూ మాట్లాడు కోవడం ఇప్పుడు అంతా చర్చించు కుంటున్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టడం ఇష్టం లేదని సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పడం.

దీనిపై షర్మిల బాధ పడడం అంతా చూసాం.అప్పటి నుండి అన్న, చెల్లెలు మాట్లాడు కోవడం లేదని వార్తలు వస్తూనే ఉన్నాయి.
కానీ ఈ రోజు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇద్దరు పక్క పక్కనే కూర్చుని మాట్లాడు కోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.
ఇది చూసిన వారంతా ఇప్పుడు వైఎస్ జగన్, షర్మిల మధ్య మాటలు మొదలయ్యాయని.విభేదాలు తొలగడంతోనే ఇలా జరిగింది అంటూ ప్రచారం సాగుతుంది.తండ్రి వర్ధంతి రోజు ఇద్దరు కలిసి నివాళులు అర్పించడం హాట్ టాపిక్ అవుతుంది.